- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ హతం
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు హతమయ్యారు. గదిరాస్ పరిధిలోని మంకపల్ వద్ద జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు మావోయిస్టుల కోసం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్యలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించగా, వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాల్పుల్లో […]</p>

X
దిశ, ఖమ్మం :
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు హతమయ్యారు. గదిరాస్ పరిధిలోని మంకపల్ వద్ద జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు మావోయిస్టుల కోసం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్యలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించగా, వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాల్పుల్లో మరణించిన గంధధుర్ అనే నక్సల్ తలపై రూ.5లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
Next Story






