- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు దళ సభ్యుడు భిక్షపతి కన్నుమూత
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: మహదేవపూర్, ఏటూరునాగారం ఏరియాలోని మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మేదరి భిక్షపతి ఈనెల 18న అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామానికి చెందిన భిక్షపతి 2018లో మావోయిస్టు పార్టీలో చేరాడు. నాటి నుంచి ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా దళంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన భిక్షపతి ఈనెల 18న మృతిచెందినట్లు పేర్కొన్నారు. సమాచారం […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: మహదేవపూర్, ఏటూరునాగారం ఏరియాలోని మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మేదరి భిక్షపతి ఈనెల 18న అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామానికి చెందిన భిక్షపతి 2018లో మావోయిస్టు పార్టీలో చేరాడు. నాటి నుంచి ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా దళంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన భిక్షపతి ఈనెల 18న మృతిచెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందని, భిక్షపతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Next Story






