- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ – ఒడిషా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఒక జవాన్ కూడా గాయపడ్డారు. మల్కన్‌గిరి జిల్లా తులసికొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాల సమాచారం మేరకు డీవీఎఫ్ ఎస్‌ఓజీ సిబ్బంది వెళ్లి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. కూంబింగ్ టీమ్‌పై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు తేరుకొని ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంటపాటు […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ – ఒడిషా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఒక జవాన్ కూడా గాయపడ్డారు. మల్కన్‌గిరి జిల్లా తులసికొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాల సమాచారం మేరకు డీవీఎఫ్ ఎస్‌ఓజీ సిబ్బంది వెళ్లి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.
కూంబింగ్ టీమ్‌పై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు తేరుకొని ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంటపాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు సమాచారం. అనంతరం ఘటన ప్రాంతంలో మావోయిస్టు మృతదేహం, ఒక ఇన్‌సాస్ రైఫిల్, మావోయిస్టుల సామాగ్రి స్వాధీనపర్చుకున్నట్లు తెలిసింది. నక్సల్స్ కాల్పుల్లో గాయపడిన సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రికి తరలించడానికి హెలికాప్టర్ ఏర్పాట్లు చేశారు.
Next Story






