- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలంలో మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మావోయిస్టు కొరియర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పుసుబాకకు చెందిన పద్దం కల్లుగా గుర్తించారు. ఈయన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మావోయిస్టు కొరియర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పుసుబాకకు చెందిన పద్దం కల్లుగా గుర్తించారు. ఈయన సీపీఐ(ఎం) స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుకు కొరియర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పాపారావు ఆదేశానుసారం కల్లు 150 డిటోనేటర్లు, రెండు లిక్విడ్ బూస్టర్లు సేకరించి నక్సల్స్‌కు చేరవేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు ఏఎస్పీ రాజశేఖర్ తెలిపారు.
Next Story






