- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు దంపతులు యాలం నరేందర్ అలియాస్ సంపత్, పొడియం దేవీలు వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ ఎదుట బుధవారం లొంగిపోయారు. యాలం నరేందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ మెంబర్, వాజేడు వెంకటాపూరం ఏరియా కమిటీ కమాండర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కమ్యూనికేషన్ ఇంచార్జ్, యాక్షన్ టీం కమాండర్‌గా పనిచేస్తున్నాడు. పొడియం దేవి తెలంగాణ మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో దళ సభ్యురాలిగా పనిచేస్తోంది. నరేందర్ అలియాస్ […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు దంపతులు యాలం నరేందర్ అలియాస్ సంపత్, పొడియం దేవీలు వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ ఎదుట బుధవారం లొంగిపోయారు. యాలం నరేందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ మెంబర్, వాజేడు వెంకటాపూరం ఏరియా కమిటీ కమాండర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కమ్యూనికేషన్ ఇంచార్జ్, యాక్షన్ టీం కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
పొడియం దేవి తెలంగాణ మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో దళ సభ్యురాలిగా పనిచేస్తోంది. నరేందర్ అలియాస్ సంపత్ చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చందూర్ గ్రామంలోని బాలల ఆశ్రమంలో మూడవ తరగతి వరకు చదువుకున్నాడు. 2005లో మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ మెంబర్, ఖమ్మం స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్ ఎనబోయిన కొమురయ్య ప్రసంగాలతో ప్రభావితుడైన యాలం నరేందర్ ఖమ్మం స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ద్వారా అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
Next Story






