మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా అరెస్ట్

by Sridhar Babu |

<p>దిశ, భద్రాచలం: ల్యాండ్‌మైన్ పేల్చడంలో మాస్టర్స్ మైండ్‌గా చెప్పుకునే మావోయిస్టు కమాండర్ హుంగా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోమవారం హుంగాను అరెస్ట్ చేసినట్లు చత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. హుంగా కిష్టారం ప్రాంతంలో 17 ప్రధాన సంఘటనలకు పాల్పడినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. పలోడి ప్రాంతంలో యాంటీ ల్యాండ్‌మైన్ వాహన పేలుడులో తొమ్మిది మంది సైనికులు చనిపోయిన ఘటన, 2020లో ఐఈడీ పేలుడులో ఒక సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ చనిపోయిన ఘటనలు హుంగా [&hellip;]</p>

మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా అరెస్ట్
X

దిశ, భద్రాచలం: ల్యాండ్‌మైన్ పేల్చడంలో మాస్టర్స్ మైండ్‌గా చెప్పుకునే మావోయిస్టు కమాండర్ హుంగా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోమవారం హుంగాను అరెస్ట్ చేసినట్లు చత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. హుంగా కిష్టారం ప్రాంతంలో 17 ప్రధాన సంఘటనలకు పాల్పడినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. పలోడి ప్రాంతంలో యాంటీ ల్యాండ్‌మైన్ వాహన పేలుడులో తొమ్మిది మంది సైనికులు చనిపోయిన ఘటన, 2020లో ఐఈడీ పేలుడులో ఒక సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ చనిపోయిన ఘటనలు హుంగా చేసినట్లు తెలిపారు.

Next Story