- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో మావోయిస్టు కమాండర్ మృతి
<p>దిశ, భద్రాచలం : దండ కారణ్య దక్షిణ బస్తర్ టెక్ టీమ్ కమాండర్ కురసం గంగయ్య అలియాస్ ఐతు కరోనా బారిన పడి కన్నుమూశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గోర్సా గ్రామానికి చెందిన ఈ మావోయిస్టు దళ నాయకుడు ఇటీవల కొవిడ్ బారిన పడ్డాడు. మావోయిస్టు కమిటీ సభ్యులు నాలుగు రోజుల కిందట గుట్టుచప్పుడు గాకుండా తీసుకొచ్చి ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని భద్రాద్రి […]</p>

దిశ, భద్రాచలం : దండ కారణ్య దక్షిణ బస్తర్ టెక్ టీమ్ కమాండర్ కురసం గంగయ్య అలియాస్ ఐతు కరోనా బారిన పడి కన్నుమూశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గోర్సా గ్రామానికి చెందిన ఈ మావోయిస్టు దళ నాయకుడు ఇటీవల కొవిడ్ బారిన పడ్డాడు. మావోయిస్టు కమిటీ సభ్యులు నాలుగు రోజుల కిందట గుట్టుచప్పుడు గాకుండా తీసుకొచ్చి ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.
ఈ విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న వారిలో ఇంకెందరు మావోయిస్టు సభ్యులు ఉన్నారనే విషయమై పోలీసులు గుట్టుగా ఆరా తీస్తున్నారు. గంగయ్య మరణం నేపథ్యంలో కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోతే వైద్యం చేయిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై మావోయిస్టుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచిచూడాలి.






