- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంపుల గ్రామానికి మావోయిస్టు అశోక్ మృతదేహం
by Sridhar Babu |
<p>దిశ, పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సంద గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం భారీ బందోబస్తు నడుమ గుంపుల గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్థం సుమారు రెండు గంటలపాటు తన ఇంటి వద్ద ఉంచనున్నారు. మృతదేహం రాకకు ముందే గ్రామంలో సంద గంగయ్య పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. గంగయ్య తల్లి తన కుమారుని మృతదేహాన్ని […]</p>

X
దిశ, పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సంద గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం భారీ బందోబస్తు నడుమ గుంపుల గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్థం సుమారు రెండు గంటలపాటు తన ఇంటి వద్ద ఉంచనున్నారు. మృతదేహం రాకకు ముందే గ్రామంలో సంద గంగయ్య పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. గంగయ్య తల్లి తన కుమారుని మృతదేహాన్ని చూసి చేసిన రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి. మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలియజేశారు.
Next Story






