- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్చిరోలిలో మావోయిస్టు అరెస్ట్…
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా కురుఖేడ తాలుక కోబ్రామెండ అటవీప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యున్ని గడ్చిరోలి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లాలోని టిప్పాగడ్ దళం డివిసి మెంబర్ కిషోర్ కావుడో అలియాస్ గొంగుళు, సోదు, గిస్సు కావుడో (38) ను అరెస్ట్ చేసినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయాల్ తెలిపారు. ఇటీవల కోబ్రామెండా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జర్గిన ఎదురు […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా కురుఖేడ తాలుక కోబ్రామెండ అటవీప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్ట్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యున్ని గడ్చిరోలి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లాలోని టిప్పాగడ్ దళం డివిసి మెంబర్ కిషోర్ కావుడో అలియాస్ గొంగుళు, సోదు, గిస్సు కావుడో (38) ను అరెస్ట్ చేసినట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయాల్ తెలిపారు. ఇటీవల కోబ్రామెండా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జర్గిన ఎదురు కాల్పుల్లో కిషోర్ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. ఏటాపల్లి తాలుక రామన్ టోలో లో తలదాచుకున్న సమాచారం అందుకున్న పోలీసులు, కిషోర్ కావుడోను అదుపులోకి తీసుకోని ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కిషోర్ కు సహకరించిన గణపతి కోహ్లెను కూడ అరెస్ట్ చేశారు. ఈయనపై పలు కేసులు ఉన్నాయని గడ్చిరోలీ ఎస్పీ మీడియాకు వెల్లడించారు.






