లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోండి: ప్రధాని మోదీ

by Shamantha N |

<p>కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ సూచనలను చాలా మంది తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘లాక్‌డౌన్‌ను చాలా మంది తీవ్రంగా పరిగణించడం లేదు. ప్రభుత్వాల సూచలను పాటించండి. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాలను కాపాడుకోండి’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్ [&hellip;]</p>

లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోండి: ప్రధాని మోదీ
X

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ సూచనలను చాలా మంది తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘లాక్‌డౌన్‌ను చాలా మంది తీవ్రంగా పరిగణించడం లేదు. ప్రభుత్వాల సూచలను పాటించండి. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాలను కాపాడుకోండి’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కేసులు నమోదైన 80 జిల్లాలను పూర్తిగా లాక్‌డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ‌‌లోని కొన్ని జిల్లాలను లాక్‌డౌన్ చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 31 అర్ధరాత్రి వరకు ఢిల్లీని లాక్‌‌డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Next Story