ట్రెండింగ్‌లో ‘20 ఇయర్స్ చాలెంజ్ విత్ బిగ్ సిస్టర్’

by  |
elephant
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ట్రెండయ్యే ఫన్నీ చాలెంజెస్ గురించి తెలిసిందే. గతేడాది లాక్‌‌డౌన్ టైమ్‌లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ తరహా చాలెంజెస్‌లో పార్టిసిపేట్ చేయగా.. తాజాగా ట్రెండ్ అవుతున్న ఓ చాలెంజ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే..

ప్రకృతి ప్రేమికుడు రెనె కసెల్లీ యానిమల్ ట్రైనర్, లవర్. ఏనుగులు, జిరాఫీ, కోతులు తదితర వన్యప్రాణులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాటితో డిఫరెంట్ ఫీట్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం తను పెంచుకున్న ఏనుగు(కింబ)తో చేసిన ఫీట్ సోషల్ మీడియాను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు ఈ ఫీట్ ఇప్పుడు ఓ చాలెంజ్‌గా మారడం విశేషం. ఇక ఫీట్ విషయానికొస్తే ‘కింబ’ నోట్లో క్యారట్ పెట్టిన రెనె.. ఓ స్టైలిష్ పోజ్ ఇచ్చాడు. ఇందుకు ఏనుగు కూడా తన స్టిల్‌తో సహకరించింది. ఓవైపు క్యారట్ తింటూనే తొండంతో గర్జిస్తున్నట్లుగా పోజిచ్చిన కింబ.. ఒక కాలు ముందుకు లేపగా, అదే సమయంలో రెనె తన కుడి చేతిని పైకి చూపుతూ ఫొటోకు స్టిల్ ఇచ్చాడు. అయితే ‘కింబ, రెనె’ 20 ఏళ్ల కిందట కూడా అచ్చం ఇలాంటి స్టిల్‌ ఇవ్వడం విశేషం.

‘20 ఇయర్స్ చాలెంజ్ విత్ బిగ్ సిస్టర్’ క్యాప్షన్‌తో రెన్ ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు క్రేజీ అండ్ సూపర్బ్ చాలెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చాలెంజెస్‌లో తాము పార్టిసిపేట్ చేయలేమని చెప్తుండగా.. ‘ఏనుగు, మానవుల మధ్య ఉన్న అనుబంధం ఇది, ఈ వీడియో చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.

Next Story

Most Viewed