నెట్‌ఫ్లిక్స్‌లో ‘మనియరయిలే అశోకన్’

by  |
నెట్‌ఫ్లిక్స్‌లో ‘మనియరయిలే అశోకన్’
X

దిశ, వెబ్‌డెస్క్ : మాలీవుడ్ యాక్టర్ గ్రెగొరీ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనియరయిలే అశోకన్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా.. దుల్కర్ సల్మాన్, గ్రెగొరీ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. షంజు జైబా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

ఓనం పండుగ కానుకగా ఈ నెల 31న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు దుల్కర్. ఇలాంటి స్వీట్ లవ్ స్టోరీ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్న ఆయన.. సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పాడు. శ్రీహరి కె నాయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అను సితార, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అశోక్ ప్రేమ, పెళ్లి, శోభనం గురించి సాగే కథ.. ప్రేక్షకులకు సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుందని చెబుతోంది మూవీ యూనిట్.



Next Story

Most Viewed