- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్‌లో ఏం చేస్తున్నారు..?
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్‌కు ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో మాణిక్కం ఠాగూర్ బుధవారం ఫోన్‌లో సంభాషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఠాగూర్‌కు రాజనర్సింహ వివరించారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తనకు చెప్పాలని దామోదరకు ఠాగూర్ చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్‌కు ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో మాణిక్కం ఠాగూర్ బుధవారం ఫోన్‌లో సంభాషించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఠాగూర్‌కు రాజనర్సింహ వివరించారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తనకు చెప్పాలని దామోదరకు ఠాగూర్ చెప్పారు. ఇప్పటికే అన్ని మండలాల వారీగా ఇన్‌చార్జీలను టీపీసీసీ నియమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలతో మాట్లాడుతున్నామని, త్వరలో అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా వివరించారు.
Next Story






