‘త్వరలోనే టీపీసీసీకి కొత్త చీఫ్’​

by Shyam |
‘త్వరలోనే టీపీసీసీకి కొత్త చీఫ్’​
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ కొత్త చీఫ్‌ను త్వరలోనే నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి​ మాణిక్కం ఠాగూర్​స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, కవిత నగల పెరుగుదల కాదని మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్‎ను ప్రకటిస్తారన్నారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని, అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్, పోలీస్, మనీ, లిక్కర్ పవర్‌ను ఉపయోగిస్తున్నారని, వాటిని నియంత్రించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల తరఫున అసెంబ్లీలో వాయిస్ ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story