ఆ హీరోకి ఒక దరిద్రపు అలవాటు ఉందంట..

by  |
ఆ హీరోకి ఒక దరిద్రపు అలవాటు ఉందంట..
X

దిశ,వెబ్ డెస్క్:సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎవరికి చెప్పుకోలేని కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి అందరి ముందు బయటపడితే వారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందులోను సిని ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నవారి అలవాట్ల గురుంచి మీడియా ముందు చెప్తే ఇంక అభిమానులు వారి గురుంచి ఏమనుకుంటారు. తాజాగా ఒక టాలీవుడ్ హీరో మరో హీరో కి ఉన్న ఒక దరిద్రపు అలవాటు గురుంచి అందరిముందు నోరుజారాడు. టాలీవుడ్ యంగ్ హీరోలు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 19 న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లలో పాల్గొంటుంది.

తాజాగా ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు, నవదీప్ కి ఉన్న ఒక దరిద్రపు అలవాటును మీడియా ముందు చెప్పేసాడు. “నవదీప్ కి ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఐదు సార్లు ఫోన్ చేసినా.. కనీసం ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయడు” అంటూ నవదీప్ సీక్రెట్ ని బయటపెట్టాడు. అయితే ఇన్ని దరిద్రపు అలవాట్లు ఉన్నా నవదీప్ మంచి ప్రతిభ గలిగిన నటుడని, అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఒక పక్క తిడుతూనే, మరోపక్క నవదీప్ ని ఆకాశానికెత్తేసాడు మంచు విష్ణు. ఇక విష్ణు మాటలకు స్పందించిన నవదీప్ “నాకు ఉన్న దరిద్రపు అలవాట్లు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే విష్ణు చెప్పాడు” అంటూ ఫక్కున నవ్వేసాడు. మరి ఈ సినిమాతో ఈ హీరోలు విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

Next Story