'మా' ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు.. తొలి సంతకం దేనిమీదంటే..?

by  |
మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు.. తొలి సంతకం దేనిమీదంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హోరాహోరీ పోరు మధ్య మా ఎలక్షన్స్ ముగిశాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు బుధవారం ‘మా’ ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన పెన్షన్‌ ఫైల్‌పై మొదటి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా విష్ణు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘మా’ అధ్యక్షుడిగా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను.. మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం నిన్న రాజీనామా చేసి, కొత్త ప్యానెల్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానిపై విష్ణు ఇంతవరకు స్పందించలేదు. మరి వారి రాజీనామాను విష్ణు అంగీకరిస్తాడా..? లేదా..? అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఒకపక్క ‘మా’ ప్రతిపక్షం అంతలా గొడవలు చేస్తున్నా వాటినేమి పట్టించుకోకుండా విష్ణు ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story