పవన్ కళ్యాణ్ తో మంచు హీరో భేటీ.. కొత్త రాజకీయమా..?

by  |

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ మంచు మనోజ్ కి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనోజ్ ప్రత్యక్షమైపోతాడు. దాని కోసం పోరాడి న్యాయం చేకూర్చేలా శ్రమిస్తాడు. ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్ గొడవలలో కూడా మనోజ్ వలనే వివాదం సద్దుమణిగింది అనే టాక్ వినిపిస్తోంది. ఇక మనోజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మనోజ్ పట్ల పవన్ కూడా ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. గతంలో అనేక సందర్భాల్లో వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం విదితమే. ఇక తాజాగా మరోసారి మంచు మనోజ్, పవన్ కళ్యాణ్ ని కలిశాడు. భీమ్లా నాయక్ షూటింగ్ గ్యాప్ లో పవన్ ని మనోజ్ కలిశారు. పవన్, మనోజ్ ఒకరికొకరు హత్తుకొని మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరు దాదాపు గంటసేపు ముచ్చటించారు. సినిమాలపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ విషయాన్నీ మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిసినా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.. ఒక పవర్ ఫుల్ అనుభవం. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. మీ మాటలకు, నాపై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు అన్నా. లవ్ యూ మచ్. జై హింద్” అని ట్వీట్ చేశాడు. ఇకపోతే ప్రస్తుతం వీరి భేటీ హాట్ టాపిక్ గా మారింది. మా ఎలక్షన్స్ లో పవన్ ఇన్ డైరెక్ట్ గా ప్రకాశ్ రాజ్ కే సపోర్ట్ చేశారు. అయినా , మంచు విష్ణు గెలవడం, అనుకోకుండా ఇప్పుడు మనోజ్, పవన్ ని కలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఇండస్ట్రీలో సినీ పెద్దలను కలుస్తున్నామని మోహన్ బాబు, విష్ణు నిన్న బాలకృష్ణను కలిసిన విష్యం తెలిసిందే. త్వరలో చిరంజీవి కలుస్తుమన్నా మంచు ఫ్యామిలీ ఇండస్ట్రీని మొత్తం ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తుందా..? లేదా కొత్త రాజకీయానికి తెర లేపుతుందా..? అనేది తెలియాలి.

Next Story