సినిమాను సర్కస్‌లా మార్చింది నువ్వు కాదా.. ఆర్జీవీకి మనోజ్ కౌంటర్

by  |

దిశ, సినిమా: వివాదాల వర్మ సంబంధం లేని విషయంలోనూ తలదూర్చడంలో ముందుంటాడు. ఇప్పటికే ‘మా’ ఎన్నికలు రచ్చ రచ్చ అయి ఉంటే.. ఆ హీట్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు ట్వీట్ చేశాడు. ‘మా అనేది జోకర్స్‌తో నిండిపోయిన ఓ సర్కస్’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ ఒపీనియన్స్ షేర్ చేస్తుండగా.. మంచు మనోజ్ దీనిపై స్పందించాడు. ‘మా సర్కస్ అయితే రింగ్ మాస్టర్ మీరే సార్’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మనోజ్ ఫ్యాన్స్.. ‘అదిరిపోయే పంచ్ ఇచ్చావ్, నువ్వు తగ్గొద్దన్నా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చెత్త సినిమాలతో సినిమాను సర్కస్‌లా మార్చేసిన ఆర్జీవీ జోకర్ అయ్యాడని.. పరువు, విలువ కోల్పోయి ఇంకొకర్ని విమర్శించి ట్రెండ్ అయ్యేందుకు చూస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. మంచు విష్ణు అయితే ఇంకా కరెక్ట్ పంచ్ ఇచ్చేవాడని అంటున్నారు.

https://twitter.com/HeroManoj1/status/1450332998084165634?s=20

Next Story