నో ‘వే’ టు ‘కరోనా’

by  |
నో ‘వే’ టు ‘కరోనా’
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే నోవెల్ కరోనా వైరస్(కొవిడ్-19) ప్రభావం లేదు. బొగ్గు బావులు, పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో కరోనా ప్రభావం అసలు లేకపోవడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆపై జిల్లా కలెక్టర్ సహా అక్కడి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న మూలంగా మంచిర్యాల జిల్లాలో కరోనా ఆనవాళ్లు లేకుండా పోయాయి.

మర్కజ్ మకిలీ లేదు, విదేశాల నుంచి జిల్లావాసులు ముందే వచ్చారు. మంచిర్యాల జిల్లాలో కరోనా ప్రభావం లేకపోవడానికి ఈ రెండు ప్రధాన కారణాలు అని తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ నిజాముద్దీన్ సభలకు అధికారుల లెక్కల ప్రకారం కేవలం 11 మంది మాత్రమే వెళ్లారు. అక్కడి సమాచారం వచ్చిన వెంటనే ఆ 11 మందిని వెంటనే క్వారంటైన్‌కు తలరించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సహా గల్ఫ్ దేశాల నుంచి జిల్లాకు మొత్తం 260 మంది వచ్చారు. వీరిలో 90 శాతం మంది కరోనా ప్రభావాని కంటే ముందే జిల్లాకు చేరుకోవడం వల్ల దాని ప్రభావం లేకుండా పోయిందని పలువురు
చెబుతున్నారు.

మొదట్లో ఇటలీ నుంచి వచ్చిన ఒక యువ ఇంజినీరు కరోనా లక్షణాలతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితోపాటు విదేశాల నుంచి వచ్చిన వారినీ అధికారులు క్వారంటైన్‌లోనే ఉంచుతున్నారు. కరోనా లక్షణాలున్న 21 మంది శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. 17 నెగెటివ్ రాగా, మరో 4 శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందని డిఎంహెచ్‌వో తెలిపారు.

కలెక్టర్ కఠిన చర్యలు..

కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచే జిల్లా కలెక్టర్ భారతి హొల్లికేరి తన యాక్షన్ ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ శాఖలను రంగంలోకి దింపి కట్టడి చేశారు. మర్కజ్, విదేశాల నుండి వచ్చిన వాళ్లను క్వారంటైన్ చేశారు. ఉల్లంఘించిన ఇద్దరిపై కేసు పెట్టారు. రోడ్ల పైకి వచ్చిన వేలాది వాహనాలను సీజ్ చేశారు. కఠిన చర్యలు తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీస్ ఆంక్షల విషయం‌లో గట్టి చర్యలు తీసుకున్నారు.

Tags: no active, covid 19 cases, mancherial, collector, sp, police, strict actions



Next Story

Most Viewed