- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోర్డింగ్ మీద పడి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: సంబంధిత అధికారుల అలసత్వమో లేక ఇతరుల అలసత్వమో తెలియదు గానీ, తనమేకేమీ సంబంధం లేని ఓ వ్యక్తి బలైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. విషయమేమిటంటే.. ఓ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరలవుతోంది. చాలా మంది ప్రస్తుతం ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఇదేక్రమంలో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇలా ఈదురు గాలులు వీయడంతో అక్కడే ఏర్పాటు […]</p>

దిశ, వెబ్ డెస్క్: సంబంధిత అధికారుల అలసత్వమో లేక ఇతరుల అలసత్వమో తెలియదు గానీ, తనమేకేమీ సంబంధం లేని ఓ వ్యక్తి బలైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
విషయమేమిటంటే.. ఓ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరలవుతోంది. చాలా మంది ప్రస్తుతం ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఇదేక్రమంలో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇలా ఈదురు గాలులు వీయడంతో అక్కడే ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ ఊడి అటుగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అదేవిధంగా మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సంబంధిత అధికారులపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికైనా అధికారులు సరిగా వ్యహరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






