- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
<p>దిశ, కోదాడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామానికి చెందిన ఏలిగి రెడ్డి వెంకట్ రెడ్డి(56) తన ద్విచక్ర వాహనంపై అనంతగిరి నుంచి త్రిపురవరం వెళ్తున్నాడు. అమీనాబాద్ గ్రామ శివారులోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]</p>

X
దిశ, కోదాడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామానికి చెందిన ఏలిగి రెడ్డి వెంకట్ రెడ్డి(56) తన ద్విచక్ర వాహనంపై అనంతగిరి నుంచి త్రిపురవరం వెళ్తున్నాడు.
అమీనాబాద్ గ్రామ శివారులోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అనంతగిరి ఎస్ఐ మందాడి రామాంజనేయులు తెలిపారు.
Next Story






