- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటికి రావద్దన్నారని దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన బేల్దారి అల్లాఉద్దీన్(30) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు మృతుని మరదలితో బాబా అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో బాబాను ఇంటి వద్దకు రావద్దని అల్లావుద్దీన్, అతని మామ జాఫర్ చెప్పారు. దీంతో బాబా మద్యం తాగి వారిపై దాడికి పాల్పడ్డాడు. అల్లా ఉద్దీన్ ను కత్తితో పొడవడంతో అతను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన బేల్దారి అల్లాఉద్దీన్(30) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు మృతుని మరదలితో బాబా అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో బాబాను ఇంటి వద్దకు రావద్దని అల్లావుద్దీన్, అతని మామ జాఫర్ చెప్పారు. దీంతో బాబా మద్యం తాగి వారిపై దాడికి పాల్పడ్డాడు. అల్లా ఉద్దీన్ ను కత్తితో పొడవడంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి మామ జాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






