జనగామలో దారుణం.. వేటకొడవళ్లతో వెంటాడి నరికారు (వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2025-07-31 15:50:48  IST  )

<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మంద మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు  ఈ రోజు ఉదయం (శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధుసూదన్ రెడ్డిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మధుసూదన్ రెడ్డి ని హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి […]</p>

జనగామలో దారుణం.. వేటకొడవళ్లతో వెంటాడి నరికారు (వీడియో)
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మంద మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం (శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధుసూదన్ రెడ్డిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మధుసూదన్ రెడ్డి ని హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పాతకక్షలు లేదా డబ్బుల విషయంలోనైన దుండగులు దాడిచేసి ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story