- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి నిప్పుపెట్టి..
<p>దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మరొక వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. దామోదర్ కోరి, మిలాన్ మచ్చా రజాక్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రజాక్, దామోదర్ కోరిపై దాడికి పాల్పడ్డాడు. అతను సాగర్ జిల్లా హాస్పిటల్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మరొక వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. దామోదర్ కోరి, మిలాన్ మచ్చా రజాక్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రజాక్, దామోదర్ కోరిపై దాడికి పాల్పడ్డాడు. అతను సాగర్ జిల్లా హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. అంతటితో కసి తీరని రజాక్.. ఆసుపత్రికి పోయి చికిత్స పొందుతున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
గురువారం పెట్రోల్ బాటిల్, లైటర్ తో ఆసుపత్రిలోకి ప్రవేశించిన రజాక్.. ఆ పెట్రోల్ ను దామోదర్ కోరిపై పోసి నిప్పుపెట్టినట్టు సీసీటీవీ వీడియో లో స్పష్టంగా కనిపించింది. మంటలు అంటుకోగానే పరారైన రజాక్ వెనకే మంటలతో దామోదర్ పరుగుపెట్టాడు. ఇక ప్రస్తుతం బాధితుడు సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రజాక్ ని అరెస్ట్ చేశారు.






