- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలి చితిపై పడుకుని ప్రియుడు సూసైడ్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. తండ్రి మొబైల్ కొనవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిపై పడుకుని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉలందురుపట్టాయిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నిత్యశ్రీ అనే విద్యార్థిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు మొబైల్ ఫొన్ కొనివ్వాలని తండ్రిని అడిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇప్పుడు కొనివ్వలేదని తండ్రి బదులివ్వడంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
తమిళనాడు రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. తండ్రి మొబైల్ కొనవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిపై పడుకుని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉలందురుపట్టాయిలో గురువారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. నిత్యశ్రీ అనే విద్యార్థిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు మొబైల్ ఫొన్ కొనివ్వాలని తండ్రిని అడిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇప్పుడు కొనివ్వలేదని తండ్రి బదులివ్వడంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు మృతురాలికి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రియుడు రాము .. ప్రియురాలు మృతిని తట్టుకోలేక ఆమె చితిపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






