మ‌ద్యం మ‌త్తులో క‌త్తిపోట్లు… వ్యక్తి మృతి

40

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: మ‌ద్యం మ‌త్తులో స్నేహితుల మ‌ద్య చోటు చేసుకున్న గొడ‌వ క‌త్తిపోట్ల‌కు దారి తీసి ఒక‌రి మృతికి కార‌ణ‌మైంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ ర‌ణ్‌వీర్ రెడ్డి క‌థ‌నం ప్ర‌కారం .. చిస్తీ చ‌మ‌న్ ప్రాంతంలో ఫుట్ పాత్‌ల‌‌పై నివాసం ఉండే చాంద్ (20),అజ్జు ఇద్ద‌రు స్నేహితులు. రోడ్ల‌పై అడుక్కోవ‌డం, కూలీకి వెళ్ల‌డం వంటివి చేస్తుంటారు. ఇలా వ‌చ్చిన ఆదాయంతో ఫుల్ గా మ‌ద్యం సేవించి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఫుట్ పాత్ ల‌పై నిద్రిస్తుంటారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌ద్యం మ‌త్తులో ఇద్ద‌రి మ‌ద్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో అజ్జు త‌న వ‌ద్ద వున్న క‌త్తితో చాంద్ ను పొడిచి పారిపోయాడు . స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాయాల‌తో ప‌డిపోయిన చాంద్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు . మృత దేహానికి శవ పంచ‌నామా నిర్వ‌హించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించారు . ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.