ఒక టీ.. మరో నగ్నచిత్రం.. వందల సార్లు అత్యాచారం : Sexual Harassment

by  |
ఒక టీ.. మరో నగ్నచిత్రం.. వందల సార్లు అత్యాచారం : Sexual Harassment
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నా కొంతమంది మృగాళ్ల మనస్తత్వం మారడంలేదు. మహిళలను లైంగికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఓ యువతికి టీ లో మత్తు మందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. సోషల్ మీడియా ద్వారా ఓ 35 ఏళ్ళ వ్యక్తికి, 24 ఏళ్ళ యువతి పరిచయమైంది.

కొద్దిరోజులకే ఆ పరిచయం స్నేహం గా మారింది. ఈ క్రమంలోనే ఒకరోజు యువతిని తన ఇంటికి అహ్వాహించాడు సదరు వ్యక్తి.. ఇంట్లోకి రాగానే తన భార్య ఇప్పుడే గొడవపడి బయటకు వెళ్లిందని కాకమ్మకబుర్లు చెప్పాడు. కొద్దీ సేపటితర్వాత అతిధి మర్యాదగా యువతికి టీ ఇచ్చాడు. ఆ టీ తాగిన యువతి మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తన ఫోన్ లో బంధించాడు.

మెలుకువ వచ్చి విషయం తెలుసుకున్న యువతి పారిపోవడానికి ప్రయత్నించింది. తన గురుంచి బయటికి చెప్తే తన నగ్న వీడియోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి బాధతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీడియోను అడ్డంపెట్టుకొని అనేక సార్లు యువతిపై లైంగికదాడి చేశాడు.

కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేని యువతి మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో యువతితో పాటు మరికొంతమంది యువతుల వీడియోలను చూసి షాక్ అయ్యారు.

Next Story

Most Viewed