ఆన్‌లైన్ ఆర్డర్: కూల్ డ్రింక్ తో పాటు యూరిన్ కూడా అమ్ముతున్నారా?

by  |
ఆన్‌లైన్ ఆర్డర్:  కూల్ డ్రింక్ తో పాటు యూరిన్ కూడా అమ్ముతున్నారా?
X

దిశ,వెబ్‌డెస్క్: అసలే మండే ఎండలు. దాహం వేస్తుందని కూల్ డ్రింక్ కూల్ గా తాగేద్దామని అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఆలోచించి తాగండి. ఎందుకంటే మీరు తాగే కూల్ డ్రింక్ లో ఏదైనా కలవొచ్చు. ఎండాకాలంలో దాహార్తిని తీరుస్తాయని తాగే ఈ శీతల పానియాలు కూల్ పాయిజన్ లాంటివేనని ఇటీవలే జరిగిన ఓ ఘటన హెచ్చరిస్తోంది.

ఇటీవల లండన్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. లండన్ కు చెందిన ఆలివర్ మెక్‌మానస్ అనే యువకుడికి బాగా ఆకలి వేడయంతో ఆన్ లైన్ లో ఫుడ్ తో పాటు ‘హలో ఫ్రెష్ యూకే’ అనే బేవరేజెస్ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టాడు. పెట్టిన ఆర్డర్ రానే వచ్చింది. అసలే కడుపులో పేగులు ఆకలికి తట్టుకోలేక మలమల మాడిపోతున్నాయి. అంతే క్షణం ఆలస్యం చేయకుండా మెక్ మానస్ ఫుడ్‌ను క్షణాల్లో లాగించేశాడు.

పీకల దాకా తిన్న మెక్ మానస్ పక్కనే కూల్ గా ఉన్న కూల్ డ్రింక్ తాగాలని బాటిల్ ఓపెన్ చేశాడు. అంతే మెక్ మానస్ గుండె జారి చేతికొచ్చింది. అందుకు కారణం ఆ బాటిల్ లో ఉన్నది కూల్‌డ్రింక్ కాదు..యూరిన్. బాటిల్లో డ్రింక్ బదులు యూరిన్ వచ్చిందా? అనే డౌట్ రావొచ్చు. అందుకే బాధితుడు కట్టలు తెంచుకుంటూ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ సదరు కంపెనీకి ట్వీట్ చేశాడు.

‘హలో ఫ్రెష్ యూకే’ నేను మీ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్ ను ఆర్డర్ పెట్టాను. కానీ నా ఆర్డర్ లో కూల్ డ్రింక్ బదులు యూరిన్ నింపిన బాటిల్ వచ్చింది. కావాలంటే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి. యూరిన్ బాటిల్‌ను అక్కడికే పంపిస్తా. టెస్ట్ చేయండి. కాదని తేలితే నన్ను కొరడాతో కొట్టండి’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలు టీవీ ఛానళ్లు విజువల్స్ కోసం తనకు కాల్స్ చేస్తున్నాయని, అందుకే ట్వీట్ ను డిలీట్ చేస్తున్నట్లు చెప్పాడు. కాగా బాధితుడి ట్వీట్ పై ‘హలో ఫ్రెష్ యూకే’ క్షమాపణలు చెప్పింది.


Next Story

Most Viewed