స్కూటీపై భార్య శవం.. నిందితుడు అరెస్టు..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-02 05:41:47  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, అందరూ చూస్తుండగానే ఆమె శవాన్ని స్కూటీ పై తీసుకు వెళ్లాడో వ్యక్తి . పోలీసుల వివరాల ప్రకారం.. వెరవాల్ గ్రామానికి చెందిన హేమ్‌నానికి నైనాతో గతేడాది వివాహం అయింది. స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో హేమ్‌నాని పని చేస్తున్నాడు. కాగా భార్య భర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో భార్య గొంతు పిసికి హేమ్‌నాని చంపేశాడు. అనంతరం [&hellip;]</p>

స్కూటీపై భార్య శవం.. నిందితుడు అరెస్టు..
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, అందరూ చూస్తుండగానే ఆమె శవాన్ని స్కూటీ పై తీసుకు వెళ్లాడో వ్యక్తి . పోలీసుల వివరాల ప్రకారం.. వెరవాల్ గ్రామానికి చెందిన హేమ్‌నానికి నైనాతో గతేడాది వివాహం అయింది. స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో హేమ్‌నాని పని చేస్తున్నాడు. కాగా భార్య భర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో భార్య గొంతు పిసికి హేమ్‌నాని చంపేశాడు.

అనంతరం స్కూటీ మీద భార్య మృతదేహాన్ని వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్లాడు. కాగా ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. స్కూటీని ఆపాలంటూ అరవడం మొదలు పెట్టారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా హేమ్‌నాని ముందుకు వెళ్లాడు. దీంతో స్థానికులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అతన్ని గ్రామస్తులు అప్పగించారు. కాగా తన భార్య శవాన్ని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయడానికి తీసుకువెళ్లినట్టు దర్యాప్తులో నిందితుడు ఒప్పుకున్నాడు. కాగా హత్యకు గల కారణాలను మాత్రం నిందితుడు వెళ్లడించలేదని పోలీసులు తెలిపారు.

Next Story