- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కొమురవెల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా శనివారం తెల్లవారుఝామున కారు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామానికి చెందిన కృష్ణాగౌడ్, సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ ముగ్గురు కొమురవెళ్లికి మారుతి సాంట్రో కారులో బయలుదేరారు. శనివారం రాత్రి తిరిగి […]</p>

దిశ, కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కొమురవెల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా శనివారం తెల్లవారుఝామున కారు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామానికి చెందిన కృష్ణాగౌడ్, సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ ముగ్గురు కొమురవెళ్లికి మారుతి సాంట్రో కారులో బయలుదేరారు. శనివారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరగా తెల్లవారుఝామున ఉగ్రవాయి శివారులో ఓ చెట్టును కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజునుజ్జు కాగా, కృష్ణాగౌడ్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ లకు తీవ్రగాయాలు అయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ప్రవీణ్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని కూడా నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు.






