రైతుల హత్యకు కుట్ర: యువతిని వేధిస్తున్నారంటూ అలజడులకు ప్లాన్

by  |
రైతుల హత్యకు కుట్ర: యువతిని వేధిస్తున్నారంటూ అలజడులకు ప్లాన్
X

దిశ,వెబ్‌డెస్క్: నలుగురు రైతు సంఘాల నేతల్ని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్న నిందితుణ్ని రైతులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల్లో కలిసి అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రదీప్ రాయ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడి గురించి ఆరా తీయగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీతో పాటు, రైతు సంఘాల నేతల్ని ఏ విధంగా హత్య చేయాలని అనుకున్నామో వివరించాడు. దీంతో కంగుతున్న రైతులు శుక్రవారం రాత్రి సింఘూ బోర్డర్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో నిందితుడు ప్రదీప్ రాయ్ కుట్ర గురించి మీడియా ఎదుట వివరించాడు.

రైతుల్ని హత్య చేసే కుట్రలో పోలీస్ అధికారి

జనవరి 26న రైతులు నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీ లో రెండు బృందాల్లో ఒక బృందంలోని నిందితులు పోలీసుల డ్రెస్ లో ట్రాక్టర్ ర్యాలీకి అంతరాయం కలిగించడం, మరో బృందంలోని నిందితులు రైతు సంఘం నేతల్లోని నలుగురిని కాల్చి చంపాలనుకున్నాం. మేం చంపాల్సిన నలుగురు రైతు సంఘం నేతల ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. వాటిని మాకు సుపారీ ఇచ్చిన ఓ పోలీస్ అధికారి ఇచ్చాడని ఒప్పుకున్నాడు. దీంతో పాటు రిపబ్లిక్‌డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో సమయంలో రైతుల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయో లేదో గుర్తించాలి. అనంతరం రైతుల్లో కలిసిపోయి ఓవైపు అలజడి సృష్టిస్తూనే మరోవైపు రైతు సంఘాల నేతల్ని హత్య చేయాలనుకున్నాం.

రైతుల్ని ఈ విధంగా చంపాలనుకున్నాం

రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించే సమయంలో పోలీస్ డ్రెస్సుల్లో ఉండే తాము తొలత ట్రాక్టర్ ర్యాలీ ఆపేయాలని వార్నింగ్ ఇస్తాం. రైతులు వింటే సరి లేదంటే మా దగ్గరున్న తుపాకులతో ముందునుంచి రైతు సంఘాల నేతల మోకాళ్లపై కాల్పులు జరుపుతాం. అనంతరం వెనుక నుంచి మా బృందంలోని సభ్యులు కాల్పులు జరిపేలా ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యునియన్ నాయకుడు జగిత్ సింగ్ మాట్లాడుతూ… మా ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ఓ యువతిని అస్త్రంగా ఉపయోగించారని, ఉద్యమం ముసుగులో రైతులు యువతిని వేధిస్తున్నట్లుగా ఆరోపించడం ద్వారా ఉద్యమం నీరుగార్చేలా ప్లాన్ చేసినట్లు, నిందితుడు తమకు చెప్పాడని అన్నారు.

కుట్రకు ఎంత డబ్బంటే

రైతుల్ని హత్య చేసేందుకు తమకు రూ.10 వేలు ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. డబ్బుకోసమే తాము ఈ కుట్రకు పాల్పడ్డామని చెప్పాడు.

పోలీసులు ఏం చెబుతున్నారు

రైతుల్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది రాయ్ పోలీస్ స్టేషన్ పోలీసులేనన్న ఆరోపణల్ని రాయ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వివేక్ మల్లిక్ ఖండించారు. స్టేషన్ లో ప్రదీప్ రాయ్ కాని, నిందితుడు చెప్పిన సిబ్బంది ఎవరు లేరని అన్నారు. నేను గత ఏడునెలలుగా రాయ్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నా. మొత్తం మీడియా సమావేశం విన్నా. ముసుగు ధరించిన వ్యక్తి ఆరోపణల్ని కొట్టిపారేస్తూ రైతుల ఆందోళనలో పోలీసుల పాత్ర లేనందున “కుట్ర” అని పిలవడంలో అర్ధం లేదన్నారు. పోలీసులు గెటప్ లో రైతులపై నిందితులు కాల్పులు జరుపుతుంటే నిజమైన పోలీసులు ఏం చేస్తారని ప్రశ్నించగా.., గతంలో కూడా ట్రాక్టర్ మార్చ్ జరిగింది, అక్కడ పోలీసులు లేరు. రైతులు మాత్రమే ఉన్నారు. నేను దొంగను కాను, నేను పారిపోయే తప్పు చేయలేదు. నేను పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నాను “అని రాయ్ ఎస్‌హెచ్‌ఓ వివేక్ మాలిక్ మీడియా ఎదుట స్పష్టం చేశాడు.


Next Story

Most Viewed