- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్ఫ్‌లో సిద్దిపేట వాసి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన సిద్దిపేట వాసి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన రాజు, స్వప్న దంపతులది నిరుపేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో పూరి గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు ఉపాధి నిమిత్తం ఎడారి దేశం అయిన బహ్రెయిన్ (బేరన్) వెళ్లాడు. అక్కడ రాజుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు వెంటనే […]</p>

X
దిశ, మెదక్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లిన సిద్దిపేట వాసి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన రాజు, స్వప్న దంపతులది నిరుపేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో పూరి గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు ఉపాధి నిమిత్తం ఎడారి దేశం అయిన బహ్రెయిన్ (బేరన్) వెళ్లాడు. అక్కడ రాజుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజు మరణవార్త విన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని సిద్దిపేటకు తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Tags : Man, Siddipeta, dies, heart attack, Gulf, siddipet, ts govt
Next Story






