- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
<p>దిశ, నర్సంపేట: నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి కాకతీయనగర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు చెన్నారావుపేట మండలం కోనపురం గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజుకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం మద్యం మత్తులో జరిగి ఉండొచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా దీనిపై మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ప్రమాదం జరగడం, ఆ పరిధిలో సీసీ టీవీ ఫుటేజీలు లేకపోవడంతో మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేయడానికి ఆస్కారం […]</p>

X
దిశ, నర్సంపేట: నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి కాకతీయనగర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు చెన్నారావుపేట మండలం కోనపురం గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజుకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం మద్యం మత్తులో జరిగి ఉండొచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా దీనిపై మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ప్రమాదం జరగడం, ఆ పరిధిలో సీసీ టీవీ ఫుటేజీలు లేకపోవడంతో మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






