- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో కూలీ మృతి..!
<p>దిశ, పటాన్‌చెరు: కరెంట్ షాక్ తగిలి కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన లింగం(35).. బతుకుదెరువు కోసం మూసాపేటలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రుద్రారం గ్రామ శివారులో డ్రైనేజ్ పైపులైను పనుల కోసం విజయ్ అనే మేస్త్రి వద్ద భార్యభర్తలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం డ్రైనేజీ పైప్ […]</p>

దిశ, పటాన్‌చెరు:
కరెంట్ షాక్ తగిలి కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన లింగం(35).. బతుకుదెరువు కోసం మూసాపేటలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రుద్రారం గ్రామ శివారులో డ్రైనేజ్ పైపులైను పనుల కోసం విజయ్ అనే మేస్త్రి వద్ద భార్యభర్తలు పని చేస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం డ్రైనేజీ పైప్ లైన్ పక్కనే ఉన్నా గ్రామ పంచాయతీ బోర్ దగ్గరికి వెళ్లడంతో ప్రమాదావశాత్తు బోర్‌కు విద్యుత్ ప్రసరించింది. దీంతో లింగంకు విద్యుత్ షాక్ తగలడంతో గమనించిన స్థానికులు సంగారెడ్డికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






