మేనబావను వాగు దాటించాడు.. తిరిగి వస్తుంటే అదేవాగులో…

by Sridhar Babu |   (  Updated:2021-08-28 09:17:31  IST  )

<p>దిశ, జమ్మికుంట: మానేరు వాగులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన మల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆవునూరి సదయ్య(48) అనే వ్యక్తి తన మేన బావ శ్రీనివాస్‌తో కలిసి ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో పరామర్శకు వెళ్లి వచ్చారు. అయితే శ్రీనివాస్‌ను తన సొంత ఊరికి పంపించేందుకు మల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మానేరు వాగును దాటించి తిరిగి వస్తున్న క్రమంలో [&hellip;]</p>

మేనబావను వాగు దాటించాడు.. తిరిగి వస్తుంటే అదేవాగులో…
X

దిశ, జమ్మికుంట: మానేరు వాగులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన మల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆవునూరి సదయ్య(48) అనే వ్యక్తి తన మేన బావ శ్రీనివాస్‌తో కలిసి ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లిలో పరామర్శకు వెళ్లి వచ్చారు. అయితే శ్రీనివాస్‌ను తన సొంత ఊరికి పంపించేందుకు మల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మానేరు వాగును దాటించి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మానేరులోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహం శనివారం మానేరు వాగులో తేలింది. మృతుని కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వీణవంక ఎస్ఐ కిరణ్ రెడ్డి తెలిపారు.

Next Story