- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి.. రెండు రోజుల తర్వాత బావిలో..
<p>దిశ, కారేపల్లి: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కారేపల్లి మందులవాడకు చెందిన వికలాంగుడైన సరికొండ రామకృష్ణ(35)కు మద్యం తాగే అలవాటు ఉంది. కిరాణాషాపులో గుమస్తా, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల పని వెళ్లకుండా మద్యం తాగుతూ ఇంటికి కూడా సరిగా వెళ్లడం లేదు. రామకృష్ణ ఈ నెల 24వ తేదిన ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. రెండు రోజులు అయినా ఇంటికి […]</p>

దిశ, కారేపల్లి: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కారేపల్లి మందులవాడకు చెందిన వికలాంగుడైన సరికొండ రామకృష్ణ(35)కు మద్యం తాగే అలవాటు ఉంది. కిరాణాషాపులో గుమస్తా, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల పని వెళ్లకుండా మద్యం తాగుతూ ఇంటికి కూడా సరిగా వెళ్లడం లేదు. రామకృష్ణ ఈ నెల 24వ తేదిన ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. రెండు రోజులు అయినా ఇంటికి రాక పోవటంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా జాడ లేడు. సోమవారం రైల్వై స్టేష్టన్ రన్నింగ్ రూమ్ పాత బావి నుండి దుర్వాసన వస్తుండటంతో అటుగా వెళ్ళిన వారు బావిలో చూడగా శవం కనిపించింది. ఈ విషయమై రైల్వే అధికారులు కారేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు శవాన్ని బయటకు తీయించగా అది సరికొండ రామకృష్ణదిగా గుర్తించారు. మృతుని సోదరుడు కోటయ్య ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పీ.కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






