- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. గ్రామస్థుడు మృతి
<p>దిశ, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అనుకోకుండా అటుగా వచ్చిన ఓ గ్రామస్థుడు మృతి చెందాడు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా మోదక్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఓతకల్పాడా అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. అదే సమయంలో ఓ చప్టా మీదికి ఓతకల్పాడా గ్రామానికి […]</p>

దిశ, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అనుకోకుండా అటుగా వచ్చిన ఓ గ్రామస్థుడు మృతి చెందాడు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా మోదక్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఓతకల్పాడా అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. అదే సమయంలో ఓ చప్టా మీదికి ఓతకల్పాడా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రావడంతో వారికీ బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భద్రతా సిబ్బంది క్షతగాత్రుడిని హుటాహుటిన జిల్లా వైద్యశాలకు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్టు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.
Tags: encounter, chhattisgarh, bijapur district, man dead






