- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనాల ఏర్పాట్లలో అపశృతి
<p>దిశ, ఎల్బీనగర్: బోనాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం గ్రామానికి చెందిన ప్యారసాని లోకేష్(18), మేనమామ మేదరి రాజు బృందంతో కలిసి నాగోల్, బండ్లగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఆదివారం జరిగే బోనాలకు శనివారం రాత్రి అలంకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఆలయ ఆర్చిపై […]</p>
దిశ, ఎల్బీనగర్: బోనాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం గ్రామానికి చెందిన ప్యారసాని లోకేష్(18), మేనమామ మేదరి రాజు బృందంతో కలిసి నాగోల్, బండ్లగూడ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఆదివారం జరిగే బోనాలకు శనివారం రాత్రి అలంకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఆలయ ఆర్చిపై పూలు అలకరిస్తుండగా.. సీరియల్ బల్బు వైరు తగిలి కరెంట్ షాక్‌తో కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో లోకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆలయ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






