గ్రామపంచాయితీ వర్కర్ ఆత్మహత్య.. కారణం అదేనా ?

254

దిశ, పరకాల: గ్రామపంచాయితీ మల్టీపర్పస్ వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కాంఠాత్మకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో క్షణికావేశంలో ఆనందం (30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందన్నారు. ఈ క్రమంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.