అభిషేక్ బచ్చన్ ఓ థర్డ్ రేటెడ్ యాక్టర్.. నెటిజన్‌ ట్వీట్

by  |
అభిషేక్ బచ్చన్ ఓ థర్డ్ రేటెడ్ యాక్టర్.. నెటిజన్‌ ట్వీట్
X

దిశ, సినిమా : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల యాక్టింగ్‌తో వారి వ్యక్తిగత విషయాలపై ట్రోలింగ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఫిమేల్ సెల్రబిటీల బాడీ, కలర్ తదితర అంశాల పట్ల నెటిజన్లు నెగెటివ్ ట్రోలింగ్ చేస్తుండగా వారు కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తున్నారు. తాజాగా బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్‌ను ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. అతడు ‘అభిషేక్ ఓ థర్డ్ రేటెడ్ యాక్టర్’ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయగా, స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు జూనియర్ బచ్చన్. అసలేం జరిగిందంటే..

స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా లైఫ్ ఈవెంట్స్‌ ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిన ‘ద బిగ్ బుల్’ గురువారం డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజైంది. కాగా ఈ సినిమా చూసిన ఓ వ్యక్తి ‘తన థర్డ్ రేటెడ్ యాక్టింగ్‌తో ఎప్పటిలాగే జూనియర్ బచ్చన్ మిమ్మల్ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయడు. ‘స్కామ్ 1992’ ఫార్ సుపీరీయర్ టు ‘ద బిగ్ బుల్’ అని, పూర్ స్క్రిప్ట్‌తో వరస్ట్ ఫిల్మ్ మేకింగ్’ అని విమర్శనాత్మక ట్వీట్ చేశాడు. దీనికి ఎపిక్ రిప్లై ఇచ్చిన అభిషేక్.. ‘మిమ్మల్ని డిసాప్పాయింట్ చేయలేదు కదా.. అది నాకు ఆనందమే! ‘ద బిగ్ బుల్’ చూసినందుకు థాంక్స్’ అని వ్యంగంగా కౌంటర్ ఇచ్చాడు. ఇక మరో ట్విట్టర్ యూజర్ ‘స్కామ్ 1992’ నేను చూశాను మళ్లీ ‘ద బిగ్ బుల్’ ఎందుకు చూడాలని ప్రశ్నించగా.. ‘నేనున్నాను’ కాబట్టి చూడండి అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు అభిషేక్. కాగా నెటిజన్లకు తమదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అభిషేక్‌‌కు ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ట్రోల్స్ పట్ల అభిషేక్ రిప్లయ్స్ చూసి బీటౌన్ సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed