- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్లలో కారంపొడి చల్లి.. హైవేపై అలా చేసిన దుండగులు
<p>దిశ, ఎల్బీనగర్ : పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్ నగర్ బావర్చి హోటల్ సమీపంలో ప్రధాన రహదారిపై ఒక కారు మార్గ మధ్యలో నిలిచిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు తొలగించి చూడగా అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పాతబస్తీకి చెందిన మహమ్మద్ పటేల్ (45) అనే వ్యక్తిని దుండగులు […]</p>

దిశ, ఎల్బీనగర్ : పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్ నగర్ బావర్చి హోటల్ సమీపంలో ప్రధాన రహదారిపై ఒక కారు మార్గ మధ్యలో నిలిచిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు తొలగించి చూడగా అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పాతబస్తీకి చెందిన మహమ్మద్ పటేల్ (45) అనే వ్యక్తిని దుండగులు కళ్లలో కారంపొడి చల్లి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి మార్గంలో మృతదేహాన్ని తరలించేందుకు యత్నించినట్లుగా అనుమానిస్తున్నారు. మార్గమధ్యలో హయత్ నగర్ వద్ద కారు చెడిపోవడంతో దుండగులు ఆధారాలు దొరక కుండా నెంబర్ ప్లేట్ ను తొలగించి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి క్లూస్ టీం బృందాలను రంగంలోకి దింపి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






