- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య అతడితో వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి భర్త దారుణం
<p>దిశ, తాండూరు: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గెట్ సమీపంలో పవన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ జలంధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు మల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం. నిందితుడు కురువ మల్లప్ప […]</p>

దిశ, తాండూరు: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గెట్ సమీపంలో పవన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ జలంధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు మల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
నిందితుడు కురువ మల్లప్ప భార్య కురువ లక్ష్మికి, బురుగుపల్లి పవన్ కు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. దీంతో ఆగ్రహానికి లోనైన మల్లప్ప పవన్‌ను హత్య చేసినట్లు సమాచారం. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.






