- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలిలో కూలీ దారుణ హత్య.. ఇది భార్య పనేనా?
<p>దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి గోపన్ పల్లి తండా రంగనాథ్ నగర్ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో రోజు కూలీగా పని చేసుకునే శేఖర్(40) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెడ భాగంలో నరకడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ కు చెందిన శేఖర్ […]</p>

X
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి గోపన్ పల్లి తండా రంగనాథ్ నగర్ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో రోజు కూలీగా పని చేసుకునే శేఖర్(40) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెడ భాగంలో నరకడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ కు చెందిన శేఖర్ బ్రతుకు దెరువు కోసం గత 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలతో కలిసి గోపన్ పల్లి తండాలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుంటుంబ సభ్యులు మాత్రం అతని భార్య జ్యోతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






