- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య..
<p>దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ కాంప్లెక్స్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. పాతబస్తీ శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శనివారం ఆ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, చార్మినార్ ఇంచార్జీ ఏసీపీ భిక్షం రెడ్డి, హుస్సేనీహాలం ఇన్‌స్పెక్టర్ నరేష్, కాలాపత్తర్ […]</p>

దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ కాంప్లెక్స్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. పాతబస్తీ శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శనివారం ఆ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, చార్మినార్ ఇంచార్జీ ఏసీపీ భిక్షం రెడ్డి, హుస్సేనీహాలం ఇన్‌స్పెక్టర్ నరేష్, కాలాపత్తర్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
శవ పంచనామ నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ జుబేర్(23) గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి శాలిబండకు వచ్చిన జుబేర్.. హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును హుస్సేనీహాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






