28న మోడీతో దీదీ భేటీ

134
mamata banerjee meets Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ నెల 28న మమతా బెనర్జీ భేటీ కానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారు. ‘నేను మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేయబోతున్నాను. ఈ పర్యటనలో ప్రధానిని కలుస్తాను. అందుకు సమయం కుదిరింది. రాష్ట్రపతినీ కలవబోతున్నాను’ అని గురువారం మమతా బెనర్జీ వెల్లడించారు.

ప్రధానితో మమతా బెనర్జీ 28న సమావేశం కాబోతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసే తేదీలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల చివరన ఢిల్లీ వెళ్లనున్న దీదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..