- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మర్డర్ కోసం నైతికంగా హత్యకు గురయ్యా : Mallika Sherawat
<p>దిశ, సినిమా : ‘మర్డర్’ సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్.. తన సెక్స్ అప్పీల్‌తోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కిస్సింగ్, బికినీ సీన్లలో బెరుకు లేకుండా నటించే భామకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ‘మర్డర్’ మూవీలో చేసిన బోల్డ్ సీన్లు.. తన పర్సనల్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీశాయని, తనను ఒక దిగజారిన మహిళగా చిత్రీకరించాయని వాపోయింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎదుర్కొన్న సంఘటనలతో నైతికంగా హత్యకు గురైనట్లు తెలిపింది. […]</p>

దిశ, సినిమా : ‘మర్డర్’ సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్.. తన సెక్స్ అప్పీల్‌తోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కిస్సింగ్, బికినీ సీన్లలో బెరుకు లేకుండా నటించే భామకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ‘మర్డర్’ మూవీలో చేసిన బోల్డ్ సీన్లు.. తన పర్సనల్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీశాయని, తనను ఒక దిగజారిన మహిళగా చిత్రీకరించాయని వాపోయింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎదుర్కొన్న సంఘటనలతో నైతికంగా హత్యకు గురైనట్లు తెలిపింది. ప్రస్తుత సినిమాల విషయానికొస్తే అలాంటి సన్నివేశాలు కామన్ అయిపోయాయని, నటీనటుల పట్ల ప్రేక్షకుల దృక్పథంలోనూ మార్పొచ్చిందని Mallika Sherawat వెల్లడించింది.
2003లో ‘ఖ్వాహిష్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మల్లిక.. ఆ తర్వాతి ఏడాదే ‘మర్డర్’ సినిమా చేసింది. కాగా, ఈ రెండు చిత్రాల్లోని బోల్డ్ సీన్ల ద్వారా తను ‘సెక్స్ సింబల్ (Sex Symbol )’గా ఎస్టాబ్లిష్ అయ్యింది. కాగా 50, 60’sలో వచ్చిన సినిమాల్లోనే మహిళలకు మంచి పాత్రలు దక్కాయని చెప్పిన మల్లిక.. ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ కనిపించడం లేదని పేర్కొంది. అలాంటి పాత్రల కోసం తను చాలా సంవత్సరాలు వెయిట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.








