Mallika Sherawat : సెక్స్ బాంబ్‌ను ప్రతీ డైరెక్టర్ టెస్ట్ చేస్తాడట!

by  |
Mallika Sherawath
X

దిశ, సినిమా: బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘Rk/RKay’. ఈ సినిమా కథ గులాబో-మెహబూబ్‌ల లవ్ స్టోరీ కాగా.. గులాబో పాత్రలో మల్లిక నటిస్తోంది. 1950, 1960 సినిమా కథలకు అంకితమిస్తూ తెరకెక్కుతున్న చిత్ర టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మల్లిక.. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీలో తన జర్నీ గురించి ఓపెన్ అయింది. ఇప్పటి వరకు చేసిన ప్రతీ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని, ఆడిషన్ లేకుండా ఒక్క సినిమా సెట్‌లో కూడా జాయిన్ కాలేదని చెప్పింది. 2003లో వచ్చిన ‘ది మైత్’ సినిమా కోసం జాకీ చాన్ కూడా ఆడిషన్ చేశారని, అంతేకాదు తనకన్నా ముందు చాలామంది నటీమణుల ఆడిషన్ తీసుకున్నాడని తెలిపింది. అయితే ఇండస్ట్రీ స్టార్ కిడ్స్ విషయంలో మాత్రం ఇది జస్ట్ ఫార్మాలిటీగా ఉంటుందన్న మల్లిక.. ‘Rk/RKay’ సినిమా కోసం తనను సంప్రదించిన డైరెక్టర్ రజత్ కపూర్ లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేశాకే ఫైనల్ చేశారని వివరించింది. ఒక వేళ క్యారెక్టర్ కోసం తన లుక్ సెట్ కాకపోతే కన్విన్స్ అయ్యేవాడు కాదని చెప్పింది.

Next Story

Most Viewed