హాట్ ఎంట్రీ.. తమిళనాడు పాలిటిక్స్‌లోకి షకీలా

by  |
shakeela
X

దిశ, వెబ్‌డెస్క్: షకీలా.. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఈమె తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనే కాకుండా, ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. మొదటగా తమిళంలో ‘‘ప్లేగర్ల్స్’’ అనే చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం. తర్వాత ‘‘కిన్నెర తుంబికళ్’’ అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా పాపులర్ అయింది. అనంతరం.. దక్షిణాది భాషల్లో వందల సినిమాల్లో షకీలా నటించారు. కామెడీ పాత్రలతో పాటు హాట్‌ సీన్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

thamil shakeela

అయితే.. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగునున్న వేళ నటి షకీలా హాట్ టాపిక్‌గా మారారు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు షకీలా. అందులో భాగంగానే ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని ఆమె వెల్లడించారు. దీంతో ఈమె రాకతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీల విస్తృత ప్రచారంతో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. దక్షణాదిలో శృంగార తారగా పేరుపొందిన ఈ హాట్‌ బ్యూటీ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో అందరూ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారో వేచి చూడాలి. తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో షకీలా పని చేయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed