ముంబైలో ‘మాస్టర్’ బ్యూటీ ప్రమోషన్స్

by  |
ముంబైలో ‘మాస్టర్’ బ్యూటీ ప్రమోషన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‌సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘పేట’ మూవీలో మెరిసిన మలయాళ కుట్టి మాళవిక మోహనన్.. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ పక్కన నటించే చాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా ‘మాస్టర్’ సినిమాతో తనకు బ్రేక్ లభిస్తుందనే నమ్మకంతో ఉంది. ఇక విజయ్ సినిమా తొలిసారిగా బీటౌన్‌లో విడుదల అవుతుండగా, మాళవిక కూడా ఈ సినిమాతోనే టాలీవుడ్, బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో అడుగుపెట్టిన ఈ యంగ్ బ్యూటీ.. అందుకు సంబంధించిన విషయాలను ‘ఇన్‌స్టా’లో పంచుకుంది.

‘ముంబైలో ‘మాస్టర్’ కిక్ స్టార్టింగ్ ప్రమోషన్స్.. మరింత ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు సినిమాపై నా ఎగ్జైట్‌మెంట్‌ను పెంచాయి’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది మాళవిక. ఈ క్రమంలో తను స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌‌ అయ్యాయి. ఇక ఈ సినిమాలో విజయ్‌కు విలన్‌గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుండగా, ఈ నెల13న విడుదలకు సిద్ధంగా ఉంది.



Next Story

Most Viewed