ఈ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది :మాళవిక

by  |
ఈ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది :మాళవిక
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ మాళవికా మోహనన్ ‘మాస్టర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా నేషనల్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్యూటీ.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో పనిచేయడం ఇష్టపడతానని, డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో ట్రై చేయడం న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోందని తెలిపింది. ముంబైలో పెరగడం, అమ్మానాన్న మలయాళీస్ కావడం ప్లస్ అయిందన్న మాళవిక.. ఇటు నార్త్, అటు సౌత్ కల్చర్ కూడా తెలిసిందని చెప్పింది. దీంతో అన్ని ఇండస్ట్రీల్లో పనిచేయడం ఈజీ అవుతోందని వెల్లడించింది. 50-60వ దశకంలో సినిమాల్లో మహిళలకు బలమైన పాత్రలు ఇచ్చేవారని.. ఇప్పుడు మలయాళీ సినిమాల్లో ఆ ట్రెండ్ కనిపిస్తోందని, అయితే అన్ని ఇండస్ట్రీలు ఈ ట్రెండ్ ఫాలో అవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ట్రావెలింగ్ తనను ఇన్‌స్పైర్ చేస్తుందన్న మాళవిక.. భిన్న సంప్రదాయాలు, సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు, మంచి నిర్ణయం తీసుకునేందుకు ట్రావెలింగ్ సాయపడుతుందని అభిప్రాయపడింది. లాక్ డౌన్‌లో ట్రావెలింగ్ చాలా మిస్ అయ్యానని తెలిపింది.

ఇక బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌‌ను ఆరాధిస్తానని తెలిపిన భామ.. తనతో యాడ్ చేయడం మరిచిపోలేని అనుభూతని చెప్పింది. తన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఆశ్చర్యమేసిందని.. చిన్న యాడ్‌లో అంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం తనకే సాధ్యమవుతుందని ప్రశంసించింది. త్వరలో రిలీజ్ కానున్న యాడ్ కోసం వెయిట్ చేస్తున్నానన్న మాళవిక.. మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది.

Next Story

Most Viewed